ప్రతి ఏడాది సంక్రాంతి మాదిరిగా రానున్న 2025 సంక్రాంతికి కూడా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీ జనవరి 10న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.
ఇక మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ NBK 109 కూడా సంక్రాంతికి రెడీ అవుతోంది. అలానే వీటితో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న వెంకీ 76 మూవీ కూడా సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమవుతోంది.
ఇక ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ముగ్గురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రానున్న సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో వీటిలో ఏ మూవీ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక అతి త్వరలో బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల రిలీజ్ డేట్స్ అఫీషియల్ గా అనౌన్స్ కానున్నాయి.