Homeసినిమా వార్తలునా పని నన్ను చేసుకొనివ్వండి అంటున్న సురేందర్ రెడ్డి

నా పని నన్ను చేసుకొనివ్వండి అంటున్న సురేందర్ రెడ్డి

- Advertisement -

అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఏజెంట్ సినిమా చాలా కాలంగా తెరకెక్కే పనిలో ఉంది. COVID-19 కారణంగా షూటింగ్ ఆలస్యం అవడంతో సహా ఈ చిత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఏజెంట్ నిర్మాతల మధ్య కూడా నిరంతరం విభేదాలు వచ్చాయని పలు రకాల కథనాలు వచ్చాయి.

ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలోని ఒక్కో సీన్ కోసం సురేందర్ రెడ్డిని నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారట. ప్రతి షెడ్యూల్ లో కూడా, వారు మార్పులు చేర్పులు చేస్తూ వారు చెప్పినట్టు చేయమని సురెందర్ రెడ్డిని అడుగుతున్నారట. అంతే కాకుండా వివిధ వ్యక్తుల నుండి సలహాలు తీసుకుంటున్నారట. ఇక అఖిల్ తండ్రి అయిన నాగార్జున నుండి కూడా స్క్రిప్ట్ విషయంలో సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా కథను మార్చమని సురేందర్ రెడ్డిని కోరుతున్నారని తెలుస్తోంది.

ఇలా ప్రతి దశలో ఏజెంట్‌ సినిమాలో మార్పులు చేయమని దర్శకనిర్మాతలు ఒత్తిడి చేయడం వల్ల సురేందర్ రెడ్డి తీవ్రంగా కలవరపడుతున్నారని తెలియవస్తుంది. ఇక నిరంతరం సలహాలు, సూచనలతో విసిగిపోయిన సురేందర్.. సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్‌లో ఎలాంటి జోక్యం అక్కర్లేదని నిర్మాతలకు తెలిపారట. ఈ అంశాలను తనకు పూర్తిగా వదిలేయాలని ఆయన వారిని మర్యాదపూర్వకంగా అభ్యర్థించారట.

READ  అఖిల్ ఏజెంట్ సినిమా పై శ్రద్ధ వహిస్తున్న నాగార్జున

తాను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు, జీవితానికి ఈ సినిమాకి ఒకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారట. మరి దీని తర్వాత నిర్మాతకు ఏలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

సురేందర్ రెడ్డి గతంలో కొన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను అందించారు. అయితే కెరీర్ లో భారీ హిట్లు ఉన్నా కూడా.. ఇమేజ్ పరంగా చాలా తక్కువ అంచనా వేయబడిన కమర్షియల్ డైరెక్టర్లలో ఒకరని చెప్పవచ్చు. రేసు గుర్రం, కిక్ లాంటి సినిమాల విజయంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఏజెంట్‌ సినిమాతో కూడా అలాంటి భారీ విజయం సాధించి ప్రేక్షకులని అలరిస్తారని ఆశిద్దాం. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఏజెంట్‌ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇతర పాత్రల్లో మరికొందరు సుప్రసిద్ధ నటులు నటించారు. సురేందర్ రెడ్డి గత సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీనే ఏజెంట్ సినిమాకు కూడా కూడా రాశారు.

Follow on Google News Follow on Whatsapp

READ  రాధికగా కనిపించనున్న శ్రీలీల


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories