Homeసినిమా వార్తలుRRR: నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్

RRR: నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్

- Advertisement -

దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం.. ఇప్పటికే పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ ఆలపించిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సాంగ్ కు ఆ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) చిత్రం మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.

READ  RRR సీక్వెల్ రచనా స్థాయిలో ఉంది, ఒక గొప్ప లైన్ రెడీ చేశాం అన్న రాజమౌళి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ప్రముఖుల వరకూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఇక ఈరోజు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తర్వాత ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా… భారతీయ చిత్ర వర్గాలు ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం చారిత్రాత్మక విజయం అంటూ కొనియాడారు.

https://twitter.com/KChiruTweets/status/1612992624511836162?t=ei9dRwGwYKQQUGkXZNAtig&s=19

ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా ఈ అరుదైన సంఘటన పై స్పందించారు. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి ఎంపిక కావడం అద్భుతమంటూ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆయన అభినందనలు తెలిపారు. కాగా ఏ ఆర్ రెహమాన్ 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

READ  బ్లాక్ బస్టర్ సినిమా ఖుషి రీ- రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
https://twitter.com/arrahman/status/1612993411673624577?t=1nyD73Y4r69IUnW9ZZm5WQ&s=19

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories