సినిమా: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
రేటింగ్: 2/5
తారాగణం: నాగ శౌర్య, మాళవిక నాయర్, మేఘా చౌదరి, శ్రీనివాస్ అవసరాల తదితరులు.
దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి
విడుదల తేదీ: 17 మార్చి 2023
నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. భారీ విజయం సాధించిన ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాల తర్వాత నాగశౌర్యతో చేసిన మూడో చిత్రమిది. ఈ చిత్రం చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని, మెచ్యూర్డ్ డ్రామాలకు పెట్టింది పేరైన అవసరాల ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని తప్పకుండా ఆకట్టుకుంటారని పేర్కొన్నారు. మరి ఆయన అనుకున్నట్టే సినిమా బాగా తీశారా లేదా చూద్దాం.
కథ: 2000 సంవత్సరం నేపథ్యంలో సాగే కథలో వైజాగ్ లో సంజయ్ (నాగశౌర్య), అనుపమ (మాళవిక నాయర్) కాలేజ్ లో ప్రెండ్స్ అవుతారు. అను సంజయ్ కంటే ఏడాది సీనియర్ అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఈ జంట బంధంలో అనుకోని విధంగా ఘర్షణలు వస్తాయి, లండన్ కు వెళ్ళిన తర్వాత సమయం వీళ్లిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. సంజయ్ భావోద్వేగపరంగా తనకు తోడు నిలిచే భాగస్వామి కాకపోవడంతో అను నిరాశ చెందుతుంది. సంజయ్ గైర్హాజరీ, ఆ దంపతుల ప్రేమ ఎలా పరివర్తన చెందుతుంది అనే విషయాల పై మిగిలిన కథనం దృష్టి పెడుతుంది.
నటీనటులు: నాగశౌర్య, మాళవిక నాయర్ తెర పై అద్భుతంగా కనిపిస్తారు. వారి కెమిస్ట్రీ కూడా ప్రశంసనీయమని చెప్పాలి. వీరిద్దరూ తమ పాత్రలకు చక్కగా సరిపోయారు మరియు 10 సంవత్సరాల రిలేషన్ షిప్ లో ఉన్న తేడాను పరివర్తనను ప్రదర్శిస్తూ చాలా సులభంగా నటించారు. అయితే ప్రధాన తారాగణం మినహా ఏ పాత్ర కూడా కన్విన్సింగ్ గా లేకపోవడం, పేలవంగా రాసుకోవడం సినిమా ప్రభావం సరిగా ఉండకుండా పోయింది. మాళవిక నాయర్ ఈ రొమాంటిక్ డ్రామాలో హైలైట్ గా నిలవడంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. మొత్తంగా ప్రధాన పాత్రధారులు భుజాన వేసుకున్న ఈ సినిమా పై మిగతా తారాగణం మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.
ప్లస్ పాయింట్స్:
- మాళవిక నాయర్
- లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
- సరళత
మైనస్ పాయింట్స్:
- నెమ్మదిగా సాగే కథనం
- ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
- పేలవమైన స్క్రీన్ ప్లే
- ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణకు కారణం
విశ్లేషణ: సినిమాల్లో సహజత్వం ఉండటం, నిజమైన మానవ భావోద్వేగాలను ప్రదర్శించడం దర్శకుడు శ్రీనివాస్ అవసరాలకు ఉన్న అతిపెద్ద బలాల్లో ఒకటి. కానీ నిజమైన భావోద్వేగాలను, పాత్ర లోతును చూపించే క్రమంలో ప్రేక్షకులను అలరించే సినిమా ప్యాకింగ్, స్క్రీన్ ప్లేను ఆయనలోని రచయిత విస్మరించారు. సినిమాలో హాస్య సన్నివేశాలు కొన్ని నవ్వులు తెచ్చిపెట్టవచ్చు కానీ అది అంత వరకే. ఇంకా బాగా రాసుకున్న పాత్రలతో బిగి సడలని కథనం ఉండి ఉంటే ఈ రొమాంటిక్ డ్రామాకు మరింత బలం చేకూరేది.
తీర్పు: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా దంపతుల మధ్య కాలక్రమేణా చెడిపోయిన సంబంధాన్ని చూపించే చాలా ప్రాథమిక అంశంతో తెరకెక్కింది. ఇలాంటి సినిమాల్లో పాత్రలను, వారి అభద్రతలను, లోపాలను చక్కగా ఎస్టాబ్లిష్ చేయడం ముఖ్యం. అలా చేయడంలో ఈ సినిమా పరాజయం పాలయ్యింది. అందరికీ ఏకగ్రీవంగా నచ్చని ప్రధాన అంశంతో తెరకెక్కిన కారణంగా ఈ సినిమా సరళంగా ఉన్నా అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయింది.