అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఈ రోజు విడుదలైంది. అతి తక్కువ బజ్ తో తెర పైకి వచ్చిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. క్లాస్ ఆడియన్స్ ఎప్పుడూ అవసరాల శ్రీనివాస్ యొక్క టార్గెట్ ప్రేక్షకులుగా ఉంటూ వచ్చారు, ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ ఆయన సినిమాలను ఎంతగానో ఇష్టపడతారు.
అయితే ఓవర్సీస్ ఆడియన్స్ ను కూడా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పూర్తవడంతో ఆ షోల నుంచి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా దారుణంగా ఉంది. సినిమా చాలా స్లోగా ఉందని, ఎక్కడ కూడా అంశాలు లేవని అందరూ అంటున్నారు. ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో సినిమా ఫెయిల్ అయిందని, అలాగని ఎంటర్ టైన్ కూడా చేయలేదని ప్రేక్షకులు అంటున్నారు.
కేవలం పాటలు మాత్రమే తెర పై బాగా వచ్చాయని, సినిమాలో ప్రేక్షకుల దృష్టిలో అదొక్కటే మంచి పాయింట్ అని, మిగతావన్నీ పేలవంగా ఉన్నాయని, శ్రీనివాస్ అవసరాల కెరీర్ లోనే అత్యంత బలహీనమైన సినిమా అని అంటున్నారు. ఇంత తక్కువ బజ్, పేలవమైన టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వాష్ అవుట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించారు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతాన్నందించారు.