ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మితమవుతున్న తాజా సినిమా పుష్ప 2. ఈ మూవీ పై మొదటి నుంచి అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ప్రచార చిత్రాలతో విశేషమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.
జగపతిబాబు, అనసూయ, సునీల్, రావు రమేష్, ఫహద్ ఫాసిల్, కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫీలింగ్స్ అనే మాస్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి థియేటర్స్ లో ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పాలి. ఇక ఈ సాంగ్ ని చంద్రబోస్ రచించగా శంకర్ బాబు కందుకూరి, మరియు లక్ష్మీ దాస అద్భుతంగా పాడారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న మాస్ స్టెప్స్ కి విపరీతమైన స్పందన లభిస్తోంది.
ముఖ్యంగా ఇందులోని మాస్ స్టెప్స్ అందర్నీ ఆకట్టుకోవడంతోపాటు నేషనల్ క్రష్ రష్మిక స్టెప్స్, గ్రేస్ తో మరింత మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో బాగా వ్యూస్ రాబడుతోంది. మొత్తంగా అందరిలో భారీ స్థాయి క్రేజ్ ఏర్పరచిన పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో చూడాలి