మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, హిందీ నటుడు దివ్యేందు నటిస్తున్నారు.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఇక నేడు శ్రీరామనవమి సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక గ్లింప్స్ లో మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాస్ అవతార్ లో అదరగొట్టారు.
ముఖ్యంగా గ్లింప్స్ లో రామ్ చరణ్ మాస్ లుక్స్, ఏ ఆర్ రహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్స్, డైలాగ్స్ బాగున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క గ్లింప్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో బాగానే వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ గ్లింప్స్ తో మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక తమ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ గ్లింప్స్ ద్వారా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. ఇక దీని అనంతరం త్వరలో సుకుమార్ తో ఒక మూవీ చేయనున్నారు రామ్ చరణ్.