పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా జంటగా నటించిన “ఖుషి” తెలుగు చిత్రసీమలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మరియు డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ఆదరణ పొందిన చిత్రాలలో ఒకటైన సినిమాగా “ఖుషి” నిలిచింది. ప్రేక్షకులలో అన్ని వయసుల వారు కూడా ఈ సినిమాకి అభిమానులు అయెంతగా అందరినీ ఆహ్లాదపరిచింది.
డిసెంబరు 31న ఖుషి రీ-రిలీజ్‌ని ప్లాన్ చేసారు మరియు డిస్ట్రిబ్యూటర్లు అన్ని ప్రాంతాలలో ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ రికార్డు స్థాయి స్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, USA ఎగ్జిబిటర్లు రీ-రిలీజ్ సినిమాలను ప్రదర్శించడానికి అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఓవర్సీస్‌లో ఖుషీ సినిమాకి భారీ విడుదల ఉండదు.
ఇండియాలో మాత్రం ఖుషి సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నైజాం ఏరియాలో వి సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నైజాంలో పవన్ కళ్యాణ్ కు అత్యంత విశేష స్థాయిలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.
ఖుషి పైకి చూడటానికి సాధారణ ప్రేమకథగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది ఇద్దరు వ్యక్తుల ఇగోలు ఎలా ఢీకొన్నాయి అనే అంశాలను సున్నితంగా తెరకెక్కించిన సినిమా. ఖుషి కంటే ముందు, పవన్ కళ్యాణ్ అప్పటికే తమ్ముడు మరియు తొలి ప్రేమ చిత్రాలతో పాటు బద్రి వంటి చిత్రాలతో సూపర్ స్టార్‌డమ్‌ను పొందారు, అయితే ఖుషి సినిమాలో దర్శకుడు ఎస్‌జె సూర్య ఆయన సత్తాను అద్భుతంగా ఉపయోగించుకున్నారు.
కోల్‌కతాలోని పాత్ర నేపథ్యాన్ని ప్రతిబింబించేలా తెలుగు చిత్రంలో పూర్తి స్థాయి ఒరిజినల్ హిందీ పాటను ఉపయోగించడం వంటి కొన్ని అద్భుతమైన ఆలోచనలను పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలో పొందుపరిచారు. అలాగే ఈ సినిమాలోని అన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను పవన్ కళ్యాణ్ కొత్తగా ఉండేలా చూసుకున్నారు. వీటికి ప్రేక్షకులు మరియు అభిమానుల నుండి కూడా బాగా ప్రశంసలు లభించాయి.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు భూమిక జోడీ కూడా అందరికి బాగా నచ్చింది. ఎందుకంటే వారిద్దరూ చాలా అందంగా కనిపించారు. ఇక మణిశర్మ పాటలు సంగీత ప్రియులలో దాదాపు క్లాసిక్ ఇమేజ్‌ని కలిగి ఉన్నాయి మరియు నేటికీ వారు ఈ సినిమాలోని పాటలను వింటూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ నటించిన జల్సా ఇప్పటికీ 3 కోట్ల గ్రాస్‌తో రీ-రిలీజ్ కలెక్షన్లలో రికార్డ్‌ను కలిగి ఉంది. మరి యూఎస్‌లో షోలు తక్కువగా ఉండటంతో ఖుషి సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.