పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ ఎపిసోడ్‌లతో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 2 షో ఇప్పుడు గొప్ప ఊపందుకుంది. కాగా ఈ బాలకృష్ణ తో కలిసి కనిపించే ఎపిసోడ్ లో పవర్ స్టార్ లో ఎప్పుడూ చూడని వినోదభరితమైన యాంగిల్ ను చూడటానికి ఆయన అభిమానులకు పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఒక టాక్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఎప్పటి నుంచో సినీ రంగంలో ఉన్న పోటీ కారణంగా ఈ ఎపిసోడ్ కి మరింత హైప్ చేకూరింది.
కాగా ఈ ఎపిసోడ్ యొక్క షూట్ నిన్ననే ముగిసింది. బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా కనిపించడంతో నందమూరి మరియు మెగా అభిమానులు ఇరువురూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక అంతర్గత నివేదికల ప్రకారం, ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందట.
బాలకృష్ణ 3 పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్‌ని అడగగా, వాటి వెనుక ఉన్న పరిస్థితులు మరియు కారణాల గురించి ఆయన స్పష్టంగా వివరించారట. పవన్ చెప్పింది విన్న బాలకృష్ణ, దీని తర్వాత కూడా ఎవరైనా ఈ అంశం పై పవన్ కళ్యాణ్‌ను ట్రోల్ చేస్తే, వారు నిజంగా సిగ్గుపడాలని, అంతే కాకుండా వారిని మనుషులుగా కూడా చూడకూడదని అన్నారట.
ఈ ఎపిసోడ్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు క్రిష్ కూడా రెండవ అతిథిగా చేరారని తెలుస్తోంది. మరియు ఈ ఎపిసోడ్‌ను కొత్త సంవత్సరం కానుకగా ప్రసారం చేయవచ్చట. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 యొక్క ఈ క్రేజీ ఎపిసోడ్‌లో యువ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఫోన్ కాల్ ద్వారా జాయిన్ అవుతారని తెలుస్తోంది.