పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయనకు స్నేహితుడు మరియు సన్నిహితుడు అయిన ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలను ఫైనలైజ్ చేయడంలో పవన్ కు సాయం చేస్తున్నారు. తమ తాజా చిత్రం భీమ్లా నాయక్ విజయం తర్వాత పవన్, త్రివిక్రమ్ కలయికలో రానున్న మరో సినిమా కోసం ఓ యువ దర్శకుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది, బహుశా ఎన్నికల తర్వాత మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాలో ఓ యువ హీరో కూడా నటిస్తారని, ఆ హీరో మరెవరో కాదు పవన్ కళ్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అని అంటున్నారు.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంభందించిన వివరాలను నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలోని అన్ని స్టైలిష్ ఎలిమెంట్స్ ను మేళవించిన ఓ వీడియోతో నిన్న షూటింగ్ ను ప్రారంభించినట్లు నిన్న నిర్మాతల నుంచి అభిమానులని ఆకట్టుకునే ఒక అప్డేట్ వచ్చింది. థమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ వీడియోకు బలం చేకూరింది. ఈ సినిమాకి ఆయన సంగీత దర్శకుడు అన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాత కాగా యువ దర్శకుడు సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.