పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 2లో కనిపించనున్నారనే వార్త ఇదివరకే మీడియాలో వచ్చింది. కాగా ఈరోజు ఆ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ (డిసెంబర్ 27) చిత్రీకరించబడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ షూట్ జరుగుతోంది, ఈ ఎపిసోడ్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఉంటారు మరియు ఈ ఎపిసోడ్ నూతన సంవత్సరం స్పెషల్‌గా వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఫోన్ కాల్ ద్వారా జాయిన్ అవుతారని సమాచారం.
షూటింగ్‌కు రంగం సిద్ధం కాగా, షో సెట్స్‌లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతూ సెట్స్ వెలుపల ఏర్పాటు చేసిన బ్యానర్‌లు, వేదిక పై ప్రత్యేకంగా ‘NBK X PSPK’ అని ఏర్పాటు చేశారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ల అరుదైన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎపిసోడ్‌తో సెట్స్ పై ఎనర్జీ అంతా ఊహించినట్లుగానే ఉంది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న చాట్ షోలో పవన్ కళ్యాణ్ కనిపించడం ఇదే తొలిసారి. అయితే అటు పవన్ ఇటు బాలయ్య ఇద్దరూ రాజకీయంగా చురుకుగా ఉన్నందున, ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్‌ను అడగబోయే ప్రశ్నల పై ఊహాగానాలు తలెత్తాయి.
అయితే అంతర్గత నివేదికల ప్రకారం, పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం మరియు రాజకీయ జీవితం గురించి బాలకృష్ణ ప్రశ్నలు అడగరట. కాగా ఆయన బృందం షో మేకర్స్‌కు కూడా అదే విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటించిన అన్ స్టాపబుల్ టీజర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసింది. ప్రభాస్, గోపీచంద్ లు ఇద్దరూ అతిథులుగా విచ్చేసిన ఎపిసోడ్ డిసెంబర్ 30న ఆహా వీడియోలో ప్రసారం కానుంది.