పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒక కొత్త సినిమా కోసం చేతులు కలిపారనే విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ తమిళ నటుడు/దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన సూపర్ హిట్ తమిళ చిత్రం వినోదయ సీతమ్‌ని ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ రీమేక్ చేస్తారని చాలా రోజులుగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఈరోజు ఈ సినిమా అఫీషియల్ లాంచ్ వేడుక జరిగింది. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. లాంచ్ ఈవెంట్‌లో సముద్రఖని, త్రివిక్రమ్, థమన్, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.
సాయి ధరమ్ తేజ్ తన మామయ్యతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాగా ఆయన తన ఆనందాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. తనకు గురువులాంటి పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో తన కల సాకారమైందని అన్నారు.
ఫాంటసీ కామెడీగా రూపొందనున్న ఈ చిత్రానికి సముద్రకని దర్శకత్వం వహించనున్నారు. చిత్ర యూనిట్ ఈరోజు రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ స్వరాలు సమకూరుస్తున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఈ సినిమా చేయడం పట్ల ఏమాత్రం సంతృప్తి చెందలేదు, ఎందుకంటే ఆయన స్టార్‌డమ్‌కు సరిపోయేంత కంటెంట్ ఇందులో లేదని వారు భావించారు. అయితే, వారు ఈ రోజు పవన్ కళ్యాణ్ లుక్ తో చాలా ఆనందంగా కనిపించారు మరియు ఈ చిత్రం కూడా వర్క్ అవుట్ అవుతుందని వారు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కోరుకున్నట్లు ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాం.