పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాబీడియోల్, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ, నోరాఫతేహి, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ ఏమిటంటే జూన్ 1 నుంచి ఎగ్జిబిటర్ల సమ్మె కారణంగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.
వాస్తవానికి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మంచి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ అంతకుముందు కోవిడ్, ఆ తర్వాత టికెట్ రేట్ సమస్యలతో ఈ రెండు సినిమాలు రూ. 100 కోట్ల షేర్ అందుకోలేకపోయాయి. మరోవైపు తాజాగా హరిహర వీరమల్లుకి మంచి పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఎగ్జిబిటర్ల సమ్మె ఒకింత సినిమాపై ఏమైనా ప్రభావం చూపుతోందా అని సందేహిస్తున్నారు.
అయితే పక్కాగా ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది, సమ్మె త్వరలోనే ఆగి వారి సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి. కాగా హరిహర వీరమల్లు సబ్జెక్టుతో పాటు కథ స్క్రీన్ ప్లే పై తమ టీంకి ఎంతో నమ్మకం ఉందని పవన్ ఈ సినిమాతో భారీ విజయం అందుకోవటం ఖాయమని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.