తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒకప్పటి కామెడీ నటి పాకీజా మనకు సుపరిచితమే. ఆమె అసలు పేరు వాసుకి. అప్పట్లో పలు సినిమాల్లో మంచి కామెడీ పాత్రలు చేసి అందరినీ మెప్పించిన పాకీజా ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు.
అయితే ఆమె ఇటీవల కొన్నాళ్లుగా పూర్తిగా ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయారు. తనకు సరైన వసతి కూడా లేదని, అలానే జరుగుబాటుకి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటూ ఆమె కొన్నాళ్లుగా పలు మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూస్ లో తన దీన స్థితి గురించి చెప్పుకొచ్చారు.
ఎవరైనా సినిమా పరిశ్రమ వారు తనకు ఆర్ధికంగా సాయం చేస్తే తన పరిస్థితి మెరుగవుతుంది ఆమె వేడుకున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆమె సాయం అర్ధించిన వీడియో ఆయన వద్దకు చేరడంతో నేడు తమ జనసేన పార్టీ సభ్యులని ప్రత్యేకంగా ఆమె వద్దకు పంపి రూ. 2 లక్షల ఆర్ధిక సాయాన్ని ఆమెకి అందించి తన గొప్ప మనసుని చాటుకున్నారు పవన్ కళ్యాణ్.
మొత్తంగా పవన్ నుండి సాయం అందడంతో ప్రత్యేకంగా ఆయన కు కృతజ్ఞతలు తెలిపారు పాకీజా.