పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్, విక్రమ్ జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ తో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన హరిహర వీరమల్లు మూవీ కొంత భాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా మిగిలిన భాగాన్ని ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి భాగం మిగతా షూట్ ని త్వరలో ప్రారంభించనున్నారు.
విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీలోకి ప్రముఖ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ని అహ్వాహిస్తూ కొద్దిసేపటి క్రితం మూవీ టీమ్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.