పవన్ కళ్యాణ్ మరోసారి తన కమిట్ మెంట్స్ తో అందరిలోనూ అయోమయం సృష్టించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అయితే ఇంతలోనే యువ దర్శకుడు సుజీత్ తో ఒకటి, తన అభిమాని అయిన హరీష్ శంకర్ తో ఒక సినిమాకు సంతకం చేశారు.
నిజానికి ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో ఎవరికీ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఆయన నటుడు, దర్శకుడు అయిన సముద్రఖనితో తమిళ సినిమా వినోదాయ సీతం రీమేక్ కు కూడా కమిట్ అయ్యారు. సుజీత్, హరీష్ శంకర్ సినిమాల కంటే ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
మరో వైపు తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో అర్థం కావడం లేదు కానీ, ఆయన తన కమిట్ మెంట్స్ తో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ప్రేక్షకులు అంటున్నారు.
ఈ బస్సు యాత్ర గనక మొదలైతే మళ్లీ సెట్స్ పైకి అంత త్వరగా రాలేరు. మరి ఇంత బిజీ షెడ్యూల్ మధ్య సినిమాలకు డేట్స్ ఎలా ఇస్తారోనని నిర్మాతలు, దర్శకులు ఆందోళన చెందుతున్నారు. మరి వారి బాధలోనూ న్యాయం ఉంది కదా.
నిజానికి పవన్ కళ్యాణ్ తో ఇదే సమస్యగా మారింది. రాజకీయాలను, సినిమాలను ఆయన మిక్స్ చేస్తారు అందుకే తరచూ డేట్స్, తన అందుబాటుని సరిగ్గా కుదిరేలా చూడటం ఆయనకు కష్టంగా మారుతుంది.