Homeబాక్సాఫీస్ వార్తలుPathaan: తొలి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిన 5వ భారతీయ చిత్రంగా నిలిచిన...

Pathaan: తొలి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిన 5వ భారతీయ చిత్రంగా నిలిచిన పఠాన్

- Advertisement -

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అద్భుతమైన విజయాన్ని సాధించింది మరియు మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. తద్వారా ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన ఐదో చిత్రంగా, తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.

ఇప్పటివరకు బాహుబలి 2, సాహో, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు తొలి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సినిమాలన్నీ తెలుగు, కన్నడ ఇండస్ట్రీలకు చెందినవి కాగా ఇప్పుడు పఠాన్ సినిమాతో బాలీవుడ్ కూడా ఈ అరుదైన క్లబ్ లోకి చేరిపోయింది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన చివరిసారిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన జీరో చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లలో కొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో మొదటి రోజు కలెక్షన్లు భారీగా వస్తాయని అందరూ భావించారు. కానీ ఇన్ని రికార్డులని తిరగరాస్తుంది అని ఎవరూ అనుకుని ఉండరు.

READ  Deepika Padukone: ప్రభాస్ ప్రాజెక్ట్ కే పై అంచనాలను పెంచిన దీపికా పదుకొనె పోస్టర్

షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన పఠాన్ లో దీపికా పదుకొనె, జాన్ అబ్రహం కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రంలో వినోదానికి కొదవ లేదు పైగా షారుక్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి.

మిడ్ వీక్ రిలీజైనప్పటికీ ఈ షారుక్ ఖాన్ స్టార్టర్ అందరి అంచనాలను మించిపోయింది. హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా తర్వాత బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పఠాన్. చివరకు 3 సంవత్సరాల తరువాత పఠాన్ మునుపటి బాలీవుడ్ సినిమాల ఓపెనింగ్ రికార్డులన్నింటినీ అధిగమించింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Dhamaka Box Office: ధమాకా ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories