Homeసినిమా వార్తలుPathaan: రెండవ రోజు నంబర్లతో రికార్డ్ బ్రేక్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ ను నెక్ట్స్ లెవల్...

Pathaan: రెండవ రోజు నంబర్లతో రికార్డ్ బ్రేక్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లిన పఠాన్

- Advertisement -

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందీ సినిమాలోనే అతిపెద్ద ఓపెనింగ్స్ నమోదు చేసింది, మరియు ఈ చిత్రం యొక్క రెండవ రోజు కలెక్షన్లు కొత్త రికార్డును నెలకొల్పినట్లు తెలుస్తోంది. నిన్న రిపబ్లిక్ డే కారణంగా సెలవు దినమైన గురువారం ఈ సినిమా వసూళ్లు రూ.70 కోట్ల నెట్ వసూలు చేసిందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ట్రేడ్ రిపోర్టుల ప్రకారం ఇంతవరకూ ఒక్కరోజులో 60 కోట్లు వసూలు చేసిన సినిమానే లేదు. అయితే వారి అంచనా ప్రకారం పఠాన్ రెండో రోజు ఏకంగా70 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అదే గనక నిజం అయితే .. పఠాన్ ఒక్క రోజులో 60-65-70 కోట్ల నెట్ సాధించిన తొలి బాలీవుడ్ సినిమా అవుతుంది.

షారుఖ్ ఖాన్ గత 3 సినిమాలు ఇండియాలో ఫుల్ రన్ లో కూడా 100 కోట్ల నెట్ వసూలు చేయడంలో విఫలమయ్యాయి. అయితే పఠాన్ కేవలం 2 రోజుల్లోనే 120 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఇదే జోరును కొనసాగిస్తే పఠాన్ తొలి వారాంతంలోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది.

READ  Pathaan: షారుఖ్ ఖాన్ తెలుగు రాష్ట్రాల్లో పఠాన్ సినిమా చూడాలని అనుకుంటున్నారు కానీ అందుకు ఓ షరతు పెట్టారు

దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ వెండితెర పైకి రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు, ప్రేక్షకులు ఆశించారు కానీ ఇంత భారీ రికార్డులు సృష్టిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

పఠాన్ తన కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరిచి బాలీవుడ్ బాక్సాఫీస్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రంలో దీపికా పదుకొనె, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Agent: అఖిల్ అక్కినేని పాన్ ఇండియా మూవీ ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories