HomeOTT సమీక్షలుOTT - ది గ్రే మ్యాన్ రివ్యూ

OTT – ది గ్రే మ్యాన్ రివ్యూ

- Advertisement -

సినిమా రివ్యూ: ది గ్రే మ్యాన్

రేటింగ్: 3/5

నటీనటులు: ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్, జెస్సికా హెన్ విక్, జూలియా బట్టర్స్, బిల్లీ బాబ్ థ్రోన్టన్ తదితరులు

కథ: మార్క్ గ్రీనీ

సినిమాటోగ్రఫీ: స్టీఫెన్ ఎఫ్ విండోన్

సంగీతం: హెన్రీ జాక్ మ్యాన్

దర్శకత్వం : రూసో బ్రదర్స్ (ఆంటోనీ, జో)

విడుదల తేదీ: జూలై 22, 2022

ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

హాలీవుడ్ సినిమాలపై మన భారత దేశంలో ఒక వర్గం ప్రేక్షకులు అసక్తి చూపుతారు. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఓటీటీ వేదికపై పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ఆ వర్గం ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు.అయితే… ధనుష్ ఒక పాత్రలో నటించిన కారణంగా దక్షిణాది ప్రేక్షకులకు సైతం ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man Telugu Movie) గురించి తెలిసింది. ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ తర్వాత దర్శక ద్వయం, రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ యాక్షన్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ: అమెరికన్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో సిక్స్ (ర్యాన్ గోస్లింగ్) ఒక ఏజెంట్. అతడికంటూ కొన్ని విలువలు ఉంటాయి. చిన్న పిల్లలను చంపడం ఇష్టం ఉండదు. అతడిని అందరూ గ్రే మ్యాన్ అంటుంటారు. బ్యాంకాక్‌లో మిషన్ మీద వెళ్లిన అతడికి సీఐఏలో ఉన్నత అకారులకు చెందిన కొన్ని రహస్యాలు కల ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఆ సమాచారం బయటకు రాకుండా ఉండటం కోసం సిక్స్‌ను చంపేయమని సీఐఏ మాజీ ఏజెంట్, సైకో లాంటి లాయిడ్ (క్రిస్ ఇవాన్స్)ను నియమిస్తారు. సిక్స్‌ను లాయిడ్ అండ్ టీమ్ చంపేసిందా? లేదా? సిక్స్‌కు సహచర ఉద్యోగి డానీ మిరండా (అనా డి ఆర్మాస్) అతడికి సహాయం చేసింది? సిక్స్ కాపాడాలనుకుంటున్న చిన్న పాప క్లైరే (జూలియా బట్టర్స్) ఎవరు? చివరికి ఏమైంది? అనేది మిగతా సినిమా.

READ  చంద్రముఖి-2: రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న రాఘవ లారెన్స్

విశ్లేషణ: ‘ది గ్రే మ్యాన్’ కథ, కథా నేపథ్యం, హీరో క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఐతే అనిపించదు. ఎందుకంటే జేమ్స్ బాండ్ మరియు మిషన్ ఇంపాజిబుల్ తరహా సినిమాకి గుర్తు చేస్తుంది కాబట్టి. అయితే గాల్లో, నేలపై, నీటిలో… ఇలా ఎక్కడైనా ఫైట్ చేసే. ఎటువంటి ప్రమాదం ఎదురుపడినా,ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా తప్పించుకునే నేర్పు మరియు సాహసం నిండిన హీరో పాత్ర చేసే వీరోచిత విన్యాసాలు ఆకట్టుకుంటాయి. అదీ కాక యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి, ఇక కెమెరా వర్క్ రిచ్‌ గా కనిపిస్తుంది. రూసో బ్రదర్స్ యాక్షన్ ఘట్టాల పై చూపించిన శ్రద్ధ, హీరోకి ఫ్లాష్‌బ్యాక్‌ మరియు అతని నేపధ్యం విషయంలోనూ చూపించి ఉంటే మరింత బాగుండేది.

నటీనటులు: ర్యాన్ గోస్లింగ్ ఫైట్స్ లో అద్భుతంగా రాణించారు. అలాగే నటనలో ఎక్కడా పాత్రలో నుంచి బయటకి రానట్టుగా తన ప్రతిభను చూపించారు. క్రిస్ ఇవాన్స్ సైకో లక్షణాలు ఉన్న విలన్ పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌లో క్రిస్ చూపించిన యాటిట్యూడ్ వారెవ్వా అనిపిస్తుంది. అనా డి ఆర్మాస్ నటన బావుంది. ధనుష్ పాత్ర కేవలం రెండు డైలాగులు, రెండు ఫైట్ లకు పరిమితం అయ్యింది. ఆ పాత్ర సినిమాలో ప్రవేశించినప్పుడు ఏదో చేస్తాడు అని ఆశిస్తాం కానీ ఏమీ చేయకుండానే ఎప్పుడు ఆ పాత్ర ముగిసిందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. బాలనటి జూలియా బట్టర్స్ ఉన్నంతలో చక్కని నటనను కనబరిచారు.

READ  అంతర్జాతీయ స్ధాయిలో తెరకెక్కనున్న మహేష్ - రాజమౌళి సినిమా

చివరిగా.. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి.. మరీ ముఖ్యంగా హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాలను బాగా ఫాలో అయ్యే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories