పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఓజి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా రానున్న దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా విశ్వంభర. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడి త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దీనిని సెప్టెంబర్ 25న రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోందట.
విఎఫ్ఎక్స్ వర్క్ లేట్ కారణంగా ఈ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారని సెప్టెంబర్ 25న ఇది పక్కాగా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అయితే తమ సినిమా రిలీజ్ వాయిదా లేదంటూ ఓజి టీమ్ తాజాగా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేస్తూ తెలిపింది. మొత్తంగా దీనిని బట్టి రానున్న దసరాకు అటు ఓజి ఇటు అఖండ 2 మధ్య బాక్సాఫిస్ పోరు తప్పేలా కనపడడం లేదు.