ఆర్ ఆర్ ఆర్ సినిమా రోజు రోజుకూ తన పరిధిని పెంచుకుంటూ పోతుంది మరియు ఈ చిత్రం గడించిన ఖ్యాతిని చూసి భారతీయ చిత్ర పరిశ్రమను గర్వపడేలా చేస్తుంది. కానీ ఈ క్రమంలో కొన్ని తప్పులతో కూడా తన ప్రయాణాన్ని నింపింది. ఇటీవలే ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అమెరికన్ యాసను ట్రై చేస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు ముందు ఆర్ ఆర్ ఆర్ ప్రచారం కోసం చేయడానికి ఎన్టీఆర్ మరియు చిత్ర యూనిట్ లోని ఇతర సభ్యులు యుఎస్ లో ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్- మోషన్ పిక్చర్, బెస్ట్ పిక్చర్- నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే రెండు కేటగిరీల్లో నామినేట్ చేశారు.
సోమవారం, యుఎస్ లో ఒక ఇంటర్వ్యూ నుండి చిత్ర బృందం పాల్గొన్న కొత్త వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ వీడియోలో ‘నాటు నాటు’ పాట గురించి మాట్లాడుతున్నారు. కానీ వీడియోలో ఆయన ఉచ్ఛారణ చాలా వరకు ఆయన అభిమానులను మరియు సాధారణ ప్రేక్షకులను కూడా చికాకు పెట్టింది.
ఈ వీడియో చూసిన వారంతా కొంతమందికి ఈ యాస బాగుండవచ్చు అని, కాగా ఎన్టీఆర్ చాలా చక్కగా మాట్లాడతారనీ, నిజానికి ఆయన మాటలు వినడాన్ని చాలా మంది ఆరాధిస్తారనీ.. ఇక ఆయన హాస్య చతురత పట్ల శ్రద్ధ వహిస్తారని అన్నారు. కానీ ఈ యాస మాత్రం వారిని ఇబ్బంది పెట్టిందని అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ సాధారణంగా మాట్లాడే విధంగానే ఈ ఇంటర్వ్యులో మాట్లాడమని ఎవరైనా ఆయనకి చెప్పి ఉంటే బాగుండేదని వారు కోరుకున్నారు. ఈ బలవంతపు యాసతో మాట్లాడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ అభిమానులు కూడా అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా అనేది దాని చరిత్ర మరియు సంస్కృతికి నిజమైన విధంగా ఉంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధిస్తోంది. అలాంటిది అమెరికాలో ఉన్నప్పుడు ఈ యాస అవసరం అని ఎన్టీఆర్ ఎందుకు భావించారో మరి తెలియదు.
ఎన్టీఆర్ యాస కృత్రిమంగా కనిపిస్తోందనే మాటలో నిజం లేకపోలేదు. బహుశా అమెరికన్ యాసలో మాట్లాడితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన భావించి ఉండవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కోసం ఎదురుచూస్తోంది. 2023 అకాడమీ అవార్డులకు సంబంధించిన తుది నామినేషన్లు జనవరి 24న వెలువడనున్నాయి.