Homeసినిమా వార్తలుNTR 30 Shooting: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ 30 - రెండో షెడ్యూల్ పూర్తి

NTR 30 Shooting: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ 30 – రెండో షెడ్యూల్ పూర్తి

- Advertisement -

ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 సినిమా ఫస్ట్ ఎనౌన్స్ మెంట్ వీడియ రిలీజైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయగలిగింది. ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను వెండితెర పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి ఒక శుభవార్త ఏంటంటే ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

నిజానికి సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా.. ఎన్టీఆర్ 30 సినిమా ప్రస్తుత షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా తాలూకు రెండో షెడ్యూల్ పూర్తికాగా, 15 రోజుల విరామం తర్వాత మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు చిన్న టీజర్ ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ కోసం చిత్ర బృందం చాలా సమయం తీసుకుంది. అందుకే అనుకున్నట్లుగా షెడ్యూల్స్ పూర్తి అవుతున్నాయి. కాగా ఎన్టీఆర్ కూడా అక్టోబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వార్ 2 సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట.

స్టంట్స్, విజువల్స్ చూసేందుకు గొప్ప హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకున్నారు చిత్ర బృందం. ఎన్టీఆర్ 30 ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోనే బెస్ట్ మూవీ అని కొరటాల శివ పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత తమ అభిమాన హీరోను మరో భారీ, విజయవంతమైన చిత్రంలో చూడాలని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

READ  NTR: ఎన్టీఆర్‌తో పాన్-ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తోన్న ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాల పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, అనిరుధ్ రవి చందర్ సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Ravanasura: అత్యంత వివాదాస్పద డైలాగ్ బైట్‌ను లీక్ చేసిన రావణాసుర టీమ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories