యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి నటించబోయే చిత్రానికి కొరటాల శివను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ హీరో దర్శకుడు ఇద్దరూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వీరిద్దరి సామర్థ్యాలకు ఎన్టీఆర్ 30 సినిమా ఒక అగ్నిపరీక్షగా మారింది.
టెంపర్ నుండి ఎన్టీఆర్ కెరీర్ లో అన్ని సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. ఇక తను చివరిగా నటించిన చిత్రం RRR ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. అంతకు ముందు అరవింద సమేత చేసి డీసెంట్ హిట్ సాధించారు ఎన్టీఆర్.
అయినప్పటికీ, ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించటంతో పాటు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద నంబర్లను సాధించిన సోలో బ్లాక్‌బస్టర్‌ను ఎన్టీఆర్ ఇంకా కొట్టలేదు.
కాగా ఎన్టీఆర్ ఇప్పటికే తన 30వ సినిమా కోసం త్రివిక్రమ్ మరియు బుచ్చిబాబుల స్క్రిప్ట్‌లను తిరస్కరించారు కూడా. తన తదుపరి సినిమా గురించి చాలా ఎంతో జాగర్తతో ఉన్నట్లు ఈ నిర్ణయాల సూచిస్తాయి. ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమా కోసం కొరటాల శివతో కలిసి పని చేయాలనే నిర్ణయం తీసుకున్నారు కనక.. ఇది తెలివైన నిర్ణయం అని నిరూపించాల్సిన ఒత్తిడి ఎన్టీఆర్ పై ఉంది.
మరో వైపు కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌తో తీయబోయే తదుపరి సినిమాతో ఎలాగైనా తన సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి నాలుగు వరుస సూపర్ హిట్‌లు సాధించిన తర్వాత, ఈ మాస్ డైరెక్టర్ కెరీర్ లోనే ఉత్తమ దశలో ఉన్నారు, అయితే ఆచార్య అనే ఒక్క సినిమా ఆయనని పాతాళంలోకి నెట్టేసినట్లు అయింది.
ఇప్పుడు కొరటాల శివ భారీ నీటి బ్యాక్ డ్రాప్ లో ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టబోతున్నారు. పైన చెప్పిన విధంగా.. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయం సాధించి మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం కొరటాలకు ఎంతైనా ఉంది.
మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ సునామీని సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాతో ప్యాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌ను స్కోర్ చేస్తే అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా మంచి పేరు తెస్తుంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ యువ సంచలనం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు