వచ్చే ఏడాది వేసవి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ 30 vs పుష్ప 2 పోటీకి రంగం సిద్ధం అవుతుంది. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రెండు ప్రాజెక్ట్‌లు రసవత్తరమైన పోరులో తలపడనున్నాయి మరియు ఈ చిత్ర బృందాలు ప్రస్తుతం వినిపిస్తున్న విడుదల తేదీలకు కట్టుబడి ఉంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక భారీ విందు అవుతుంది.
నిజానికి సెట్స్‌కి వెళ్లే ముందు పుష్ప 2 టీమ్ ఏప్రిల్ 5న విడుదల తేదీని ప్లాన్ చేసింది మరియు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే క్రమంలో అదే విషయాన్ని ప్రకటించాలని అన్ని రకాల సన్నాహాలు చేసారు. అయితే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్30 టీమ్ హఠాత్తుగా అదే విడుదల తేదీని ప్రకటించడం పుష్ప2 టీమ్‌ని ఆశ్చర్యపరిచిందట.
అయితే ముందుగా అనుకున్న విడుదల తేదీకి రాకపోయినా సరే అల్లు అర్జున్ 2024 వేసవిని వృధా చేయకూడదు అనుకుంటున్నారు అని సమాచారం. ఎందుకంటే భారీ హైప్ తో వచ్చే ఈ సినిమా విడుదలకు అదే బెస్ట్ సీజన్ అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప 2 యొక్క నిర్మాతలు ఇప్పుడు తమ సినిమాని గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్చి 29 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 ఇప్పటికే భారీ బజ్‌ని కలిగి ఉన్నందున ఇప్పుడు ఎన్టీఆర్ 30 టీమ్‌కి ఇది ఖచ్చితంగా ఒక సవాలుగా ఉంటుంది మరియు పోటీ వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది.
కొరటాల శివ తన సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మరియు చిత్ర నిర్మాణంలో రాజీ పడకూడదని కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి స్కేల్ మరియు విఎఫ్ఎక్స్ భారీ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, విలన్ పాత్ర కోసం సైఫ్ అలీఖాన్‌ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి, ఎన్టీఆర్ 30 కూడా జాతీయ స్థాయిలో పుష్ప 2 కు బలమైన పోటీదారు అవుతుంది.