Homeసినిమా వార్తలుNTR: కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం?

NTR: కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం?

- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన తరువాత ఎన్టీఆర్ మళ్లీ తన తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 సినిమా ఫస్ట్ ఎనౌన్స్ మెంట్ వీడియో రిలీజైనప్పటి నుంచి విపరీతమైన బజ్ క్రియేట్ చేయగలిగింది. అయితే తాజాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ కు డ్యూయల్ రోల్స్ లో నటించడం కొత్తేమీ కాదు. ఇది వరకే దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన కామెడీ యాక్షన్ డ్రామా అదుర్స్ లో ఆయన రెండు పాత్రలు పోషించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 లో ఆయన ఇదివరకూ కనిపించని అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. ఈ చిత్రంలో ఆయన తండ్రీ కొడుకులుగా నటించనున్నారని సమాచారం అందుతోంది.

స్టంట్స్, విజువల్స్ చూసేందుకు గొప్ప హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకున్నారు చిత్ర బృందం. ఎన్టీఆర్ 30 ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లోనే బెస్ట్ మూవీ అని కొరటాల శివ సినిమా యొక్క పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత తమ అభిమాన హీరోను మరో భారీ, విజయవంతమైన చిత్రంలో చూడాలని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

READ  NTR30: ఎన్టీఆర్ 30 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్, లొకేషన్ వివరాలు

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాల పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Simhadri: సింహాద్రి సినిమాని ఇండస్ట్రీ హిట్ అని జోరుగా ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories