Homeసినిమా వార్తలుNTR: తన బ్యాడ్ ప్లానింగ్ తో అభిమానులని నిరుత్సాహపరుస్తున్న ఎన్టీఆర్

NTR: తన బ్యాడ్ ప్లానింగ్ తో అభిమానులని నిరుత్సాహపరుస్తున్న ఎన్టీఆర్

- Advertisement -

ఎన్టీఆర్ తన అభిమానులను బ్యాడ్ ప్లానింగ్ తో నిరాశపరుస్తున్నారు. ఎన్టీఆర్ తన ప్రైమ్ టైమ్ మొత్తం వృధా చేస్తున్నారని, ఇది భవిష్యత్తులో ఆయన కెరీర్ ను ప్రభావితం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

2018 లో అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ కనిపించారు. ఆ తర్వాత దాదాపు 5 సంవత్సరాలు ఆర్ ఆర్ ఆర్ కోసం వెచ్చించారు. అయితే ఆయన అభిమానులకు ఈ సినిమా పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు ఎందుకంటే ఎస్ ఎస్ రాజమౌళి రామ్ చరణ్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని వారు భావించారు మరియు ఎన్టీఆర్ తన కెరీర్ లో విలువైన సమయాన్ని ఆర్ ఆర్ ఆర్ కోసం వృధా చేశారని వారు భావించారు.

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తమ హీరోకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం వారిని ఆనందపరిచింది. కానీ ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ తన తప్పు నుంచి పాఠాలు నేర్చుకోలేదు, ఇప్పటి వరకూ ఆయన తన తదుపరి సినిమా మొదలు పెట్టలేదు. కాగా 2024 వేసవిలో తన తదుపరి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు.

READ  ED విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

దాంతో ఎన్టీఆర్ 30 సినిమా కోసం ఆయన అభిమానులు ఏడాది పైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత తమ అభిమాన హీరో ఇలా సమయాన్ని వృథా చేసుకోవడంతో అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు.

ఇదిలా ఉంటే పైన చెప్పుకున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో ఎన్టీఆర్30 విడుదల తేదీని ప్రకటించింది. యువసుధ ఆర్ట్స్ పతాకం పై సుధాకర్ మిక్కిలినేని, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారన్న విషయం తెలిసిందే.

ఆర్ రత్నవేలును డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా నియమించారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనుండగా, అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  NTR30: ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కాస్త ఆనందాన్ని ఇచ్చిన కొరటాల శివ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories