ఆస్కార్ వేదిక పై గాయకులు రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ నాటు నాటు పాట లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని ఇప్పటికే ధృవీకరించబడింది మరియు అప్పటి నుండి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా గాయకులతో కలిసి కాలు కదపాలని ఇరు వర్గాల అభిమానులు కోరుతున్నారు. అందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నటుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కోరికను వ్యక్తం చేశారు.
మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్‌లో టీమ్ ఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం భారీ స్థాయిలో సందడి చేయనుంది. RRR సినిమాలోని గ్లోబల్ చార్ట్‌బస్టర్ నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఆ అవార్డుల కార్యక్రమంలో ప్లేబ్యాక్ సింగర్లు రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ నాటు నాటు పాటను ఆస్కార్ వేడుకలో లైవ్ పెర్ఫాం చేయనున్నారు. ఇప్పుడు, RRR యొక్క ఆస్కార్ ప్రచారం కోసం యుఎస్‌లో ఉన్న నటుడు రామ్ చరణ్, తాజా ఇంటర్వ్యూలో ఆస్కార్ వేదిక పై నాటు నాటు హుక్ స్టెప్‌ను ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంటుంది అని పేర్కొన్నారు.
ప్రేక్షకులను అలరించడం కోసం డ్యాన్స్ చాలా సంతోషంగా ఉంటుందని రామ్ చరణ్ అన్నారు. అయితే స్టేజ్ పై మొత్తం పాటకు డ్యాన్స్ చేయడం మాత్రం సాధ్యం కాదని ఆయన తెలిపాయి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ నాటు నాటు పాటకి ఒకరితో ఒకరి కలిసి డాన్స్ చేస్తుంటే అది ఆస్కార్‌లో హైలైట్ అవుతుందని ఖచ్చితంగా యావత్ ప్రపంచం లోని తెలుగు సినీ అభిమానులందరికీ ఒక కన్నుల పండుగలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ నుండి ఏ ఆర్ రెహమాన్ యొక్క జై హో తర్వాత, ఆస్కార్స్‌లో ప్రత్యక్షంగా ప్రదర్శించబడిన రెండవ భారతీయ పాటగా నాటు నాటు నిలిచి చరిత్ర సృష్టించింది.
ఆస్కార్ చివరి షార్ట్‌లిస్ట్‌కు నాటు నాటు పాటను ఎంపిక చేసినందున ఆస్కార్ అకాడమీ ఇప్పటికే ఆస్కార్ వేదిక పై కాలభైరవ మరియు రాహుల్ ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తున్నారని అధికారిక ధృవీకరణ ఇచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ సమయంలో స్టేజ్‌పై డ్యాన్స్ చేయనున్నట్లు ధృవీకరించారు. కాబట్టి ఎన్టీఆర్ మరియు చరణ్ ప్రదర్శన చేయడం ఖాయం. ఎందుకంటే ఈ వారాంతంలో RRR ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆయన USA కి వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే, RRR సినిమా కోసం లాస్ ఏంజిల్స్‌లో మార్చి 1న 1647 మంది హాజరుకానున్న ప్రత్యేక స్క్రీనింగ్ కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి మరియు రామ్ చరణ్ ఈ స్క్రీనింగ్‌కు హాజరవుతారు, ఆ తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.