తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు వెట్రిమారన్ జూనియర్ ఎన్టీఆర్, ధనుష్ లతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక భాగంలో నటిస్తుండగా, ధనుష్ మరో భాగంలో నటించనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
వెట్రిమారన్ ప్రస్తుతం సూర్య హీరోగా వాడివసల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తారక్, ధనుష్ లతో చేసే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్, ధనుష్ లతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా కార్యరూపం దాలిస్తే నిజంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. 5 సార్లు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయిన వెట్రిమారన్ సహజత్వంతో పాటు బలమైన కథలు, పాత్రలు మరియు స్క్రీన్ ప్లేకు ప్రసిద్ది చెందారు.
కాగా హీరో ధనుష్ తో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వడ చెన్నై, అసురన్ వంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు 4 సినిమాల్లో నటించారు. ఈ దర్శకుడితో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా నిజంగానే తన నటనా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోయినా ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఎప్రిల్ లో ఎన్టీఆర్ 30 విడుదల కానుంది.