Homeసినిమా వార్తలుAllu Arjun - NTR : చర్చల్లో ఉన్న ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మల్టీస్టారర్

Allu Arjun – NTR : చర్చల్లో ఉన్న ఎన్టీఆర్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్

- Advertisement -

అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు పొందిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్..అలాగే పుష్ప ది రైజ్ వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ స్టార్ డమ్ ను మరో స్థాయికి పెంచుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ఓ భారీ బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీలో నటించనున్నారని తెలుస్తోంది.

పౌరాణిక ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ‘అశ్వథ్థామ’ కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు దాదాపుగా ధృవీకరించాయి. జాతీయ అవార్డు గ్రహీత బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జియో స్టూడియోస్ నిర్మిస్తోంది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది, కానీ చిత్రీకరణలో సరైన పురోగతి లేకపోవడం వల్ల సినిమా కార్యరూపం దాల్చలేదు.

READ  NTR30: నిరాశపరిచిన ఎన్టీఆర్ 30 హీరోయిన్ అనౌన్స్మెంట్ అప్ డేట్

మొదట విక్కీ కౌశల్ స్థానంలో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ను అశ్వత్థామ సినిమాలో హీరోగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రణ్ వీర్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఈ సినిమా ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల చేతుల్లోకి వెళ్తుందని తెలుస్తోంది. మరో వైపు ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో కాలమే తెలియజెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  Dasara: ఇంకా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటని నాని దసరా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories