Homeసినిమా వార్తలుNTR 31 Movie Launch గ్రాండ్ గా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్

NTR 31 Movie Launch గ్రాండ్ గా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక దీనితో పాటు మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ షూట్ లో కూడా పాల్గొంటున్నారు.

అయితే వీటి అనంతరం తన తదుపరి మూవీని కూడా నేడు గ్రాండ్ గా లాంచ్ చేసారు ఎన్టీఆర్. కెజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఇటీవల అధికారికాక ప్రకటన వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ 31 గా రూపొందనుంది. విషయం ఏమిటంటే, నేడు హైదరాబాద్ లో ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి.

మూవీ టీమ్ తో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కుటుంబసభ్యులు, నిర్మాత దిల్ రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేసారు. సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది.

READ  Prabhas New Movie Update బ్రేకింగ్ : ప్రభాస్ కి జోడిగా ఇంటర్నేషనల్ బ్యూటీ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories