హరి హర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా మూవీ క్లబ్ లో అడుగుపెడుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ గత ఏడాది విడుదలైన ఫస్ట్ లుక్ తో భారీ బజ్ క్రియేట్ చేయగా, పవన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చేయడం చూసి అభిమానులు మురిసిపోయారు. అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత క్రమంగా ఈ ప్రాజెక్ట్ పై బజ్ తగ్గింది. అడపాదడపా ఆన్ లొకేషన్ పిక్స్, పవన్ ట్రైనింగ్ వీడియోలు విడుదల చేసినా కూడా మొదట్లో ఉన్న ఊపును కొనసాగించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ కాలేదనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా నిర్మాత పై, చివరకు పవన్ కళ్యాణ్ పై కూడా చాలా భారాన్ని మోపుతోంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ లో ఉంది. 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని నిర్మాతే ఇటీవల స్వయంగా ధృవీకరించారు.
ఇతర పెద్ద పాన్ ఇండియా సినిమాల మాదిరిగా బజ్ లేకపోవడం ఈ సినిమా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. అందుకే నిర్మాతలు ఆశించిన స్థాయిలో బిజినెస్ కూడా జరగడం లేదు. దీనికి తోడు ఫైనాన్షియర్లు కూడా ఈ సినిమాకు ఫైనాన్స్ చేయడం రిస్క్ గా భావిస్తున్నారు. నిర్మాత ఈ సినిమా కోసం భారీగా అడ్వాన్స్ తీసుకున్నారని కూడా అంటున్నారు.
ఇప్పటికే మరో మూడు సినిమాలకు సంతకం చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల పై దృష్టి సారించి అన్ని షూటింగులను ఒకేసారి పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. క్రిష్ గతంలో బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను డైరెక్ట్ చేయగా, ఈ ప్రాజెక్ట్ మరో లెవెల్ లో ఉండటం, ఆయన అనుభవరాహిత్యంతో పాటు సినిమాకి బజ్ లేకపోవడం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు కష్టాలు ఎదురవుతున్నాయి.