Homeసినిమా వార్తలుకార్తీకేయ-2 ఓటిటి రిలీజ్ డీటైల్స్

కార్తీకేయ-2 ఓటిటి రిలీజ్ డీటైల్స్

- Advertisement -

యువ హీరో నిఖిల్ మరియు దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ 2 అసలు ప్రేక్షకులు కానీ ఎవరూ ఊహించని స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి భారీ విజయం సాధించింది. ఆగష్టు 13న థియేటర్లలో విడుదలైనప్పటి నుండి అటు ప్రేక్షకులు ఇటు ట్రేడ్ వర్గాలు అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. భారతదేశం నలుమూలల నుండి అమితమైన ప్రేమను సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిన కూడా భారీ సంఖ్యలో వసూళ్లు నమోదు చేస్తోంది.

తెలుగు వెర్షన్ విజయం ప్రతి ఒక్కరూ ఊహించిందే అయినా, హిందీ వెర్షన్ విజయం మాత్రం అందర్నీ ఉలిక్కిపడేలా చేసిందనే చెప్పాలి.హిందీ వెర్షన్ మొదటి రోజున 8 లక్షల నెట్ వసూళ్లతో మొదలైన కార్తీకేయ 2.. ఆ తర్వాత మూడవ, నాలుగవ రోజున కోటి రూపాయలకు పైగా వసూలు చేయడం విశేషం. నిజానికి, కార్తికేయ 2 అనేక ప్రాంతాల్లో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్‌ల వసూళ్లను మించిపోయింది.

ఇక బాక్సాఫీస్ సందడి మధ్య, సినిమాకి సంబందించిన స్ట్రీమింగ్ వివరాలు బయటకి వచ్చాయి. భారత దేశ ఓటిటి సంస్థలలో ఒకటైన దిగ్గజ సంస్థ అయిన ZEE5 ఈ సినిమా హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఆ విషయం ధియేటర్లలో సినిమా చూసిన వారందరికీ తెలుసు. కానీ ఎన్ని రోజులకు ఓటిటిలో విడుదల అవుతుంది అనే విషయం మాత్రం ఇప్పుడు తెలిసింది. కార్తికేయ 2 6 వారాల గ్యాప్ తర్వాత మాత్రమే ఓటిటిలో విడుదల అవుతుంది. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌ను పూర్తిగా ఆస్వాదించిన తరువాత ఈ చిత్రం మన టివీ, మొబైల్ ఫోన్ లలో అందుబాటులోకి వస్తుంది.

READ  కాజల్ లేక పోవటం వలన 10 కోట్లు నష్టపోయిన ఆచార్య

ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష సహాయక పాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక అతిథి పాత్రలో నటించారు. కాల భైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories