Homeసినిమా వార్తలుకార్తీకేయ 2 రిలీజ్ కష్టాల ధాటికి ఎడ్చేశాను అన్న నిఖిల్

కార్తీకేయ 2 రిలీజ్ కష్టాల ధాటికి ఎడ్చేశాను అన్న నిఖిల్

- Advertisement -

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నిఖిల్, స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తరువాత కొన్ని పరాజయాలు ఎదురైనా.. ఆయన నటించిన చివరి చిత్రం అర్జున్ సురవరం హిట్ గా నిలిచింది.

ఇక వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా కాన్సెప్ట్, టేకింగ్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ పరంగా కూడా కార్తికేయ మంచి మార్కులు రాబట్టింది. 2014లో విడుదలైన ఈ సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటించారు.

కార్తికేయ చిత్రం తర్వాత దర్శకుడు చందూ మొండేటి మళయాళ సినిమా ప్రేమమ్ తెలుగు రీమేక్ తెరకెక్కించారు. అది చక్కని విజయం సాధించగా, ఆ తరువాత అదే కాంబినేషన్లో వచ్చిన సవ్యసాచి ఘోరంగా పరాజయం పాలయింది. ఇక ఆయన తాజా సినిమా బ్లడీ మేరీ ఓటీటీ లో విడుదలై పరవాలేదు అనిపించుకుంది.

అందువల్ల కార్తీకేయ 2 స్క్రిప్టు పై చందూ మొండేటి చాలా జాగ్రతగా పని చేసినట్లు సమాచారం. జులై 22న విడుదల కావాల్సిన కార్తికేయ 2, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఆగస్టు 12 తేదీన విడుదల అవుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాను సెన్సార్ కార్యక్రమాలకు పంపించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తికేయ 2 యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. ఇక సినిమాలో ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ సభ్యులు పాస్ చేసినట్లు సమాచారం.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో భాగంగా హీరో నిఖిల్ పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని అంశాల పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఏ రకమైన బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక సినిమాని విడుదల చేయడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది అని నిఖిల్ అన్నారు. జూలై 22న సినిమాని విడుదల చేయడానికి అంతా సిద్ధం చేసి ఉంచితే, వేరే సినిమా కోసం పోస్ట్ పోన్ చేయమన్నారని, సరే అని ఆగస్ట్ 12న విడుదల తేదీ ప్రకటిస్తే, థియేటర్ల కేటాయింపులో కష్టం అవుతుందని, అందువల్ల సినిమా విడుదల తేదీని అక్టోబర్ కు వాయిదా వేసుకోమని కొందరు చెప్పినట్లు నిఖిల్ తెలిపారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఇక నిస్సహాయ స్థితిలో ఉండి పోయానని, ఒక సమయంలో ఎడ్చేసానని నిఖిల్ బాధ పడ్డారు.

READ  సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నాజర్?

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా కార్తికేయ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో నటించడం విశేషం. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. మరి అన్ని సమస్యలను అధిగమించి విడుదలవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి నిఖిల్ కు మరపురాని సినిమాగా మిగిలిపోతుందని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  సీతారామం ట్రైలర్ రివ్యూ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories