Homeసినిమా వార్తలుOTT రిలీజ్ పై కొత్త నిబంధనలు అమలు లోకి తెస్తున్న తెలుగు సినిమా నిర్మాతల మండలి

OTT రిలీజ్ పై కొత్త నిబంధనలు అమలు లోకి తెస్తున్న తెలుగు సినిమా నిర్మాతల మండలి

- Advertisement -

ఓటీటీల హవా మొదలైన తర్వాత థియేటర్ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడిందనేది వాస్తవం. భారీ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకూ అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలలోకి వస్తుండటంతో, మిగతా సినిమల థియేట్రికల్ రన్ పై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఎలాగూ మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా అని ఒక వర్గం ప్రేక్షకులు అసలు థియేటర్లకే రావడం మానేశారు అనేది కూడా నిజమే.

ఈ విషయాన్ని గ్రహించిన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ అంశాలపై ఇటీవల వరుస సమావేశాలు నిర్వహించారు.ఒక సినిమా థియేట్రికల్ రిలీజ్ మరియు డిజిటల్ రిలీజ్ మధ్య ఖచ్చితంగా కొంత గ్యాప్ ఉండాలనే పరిమితులు పెడితేనే థియేటర్ వ్యవస్థను కాపాడుకోవచ్చనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం గిల్డ్ నిర్మాతలు సమావేశమై ఈ విషయంపై చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారట.

ఆ కొత్త నిర్ణయాలు ఏవంటే.. పెద్ద సినిమాలు అంటే అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు అయితే థియేటర్లో సినిమా విడుదలైన8 వారాల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండాలని, అవి కాక ఇతర చిన్న,మీడియం బడ్జెట్ సినిమాలు అయితే 6 వారాల తరువాత ఓటిటిలోవిడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తుంది.జూలై 1 నుంచి ఓటీటీ ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ కొత్త నిభందనలు వర్తిస్తాయి.

అయితే ఈ కొత్త డిజిటల్ రిలీజ్ నిభందనలతో అందరు నిర్మాతలు అంగీకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్ లో ప్రేక్షకాదరణ పొందని సినిమాలను తొందరగా ఓటీటీ లో విడుదల చేయకపోతే నిర్మాత రెండు విధాలుగా నష్టపోయే ప్రమాదం ఉందని కొందరు నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారని తెలుస్తోంది.డిజిటల్ వేదికలు తొందరగా స్ట్రీమింగ్ కు ఒప్పుకుంటే భారీ మొత్తాలను చెల్లించి సినిమాలను కొంటారు.అలాగే కొన్ని సినిమాలకి థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా మంచి రేట్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.

ఇటీవల కొన్ని పెద్ద చిత్రాలు సైతం మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదల అవ్వడానికి ఇదేప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.కానీ ఇప్పుడు 50 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అంటే నిర్మాతలు అలాంటి లాభసాటి వ్యాపారం కోల్పోతారు.ఎందుకంటే ఓటీటీ సంస్థలు దీనికి అనుగుణంగానే తక్కువ రేట్లకు ఒప్పందాలు చేసుకుంటారు కాబట్టి. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చినా ఇబ్బంది ఉండదు కానీ,ప్లాప్ సినిమాలు కూడా ఆలస్యంగా విడుదల చేయాల్సి వస్తే మాత్రం ఇదొక సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే కొందరు ఈ నిర్ణయం పై తర్జనభర్జనలు పడుతున్నారని అంటున్నారు.

READ  ఇక పై పక్కా కమర్షియల్ అంటున్న రానా

థియేటర్లలో సినిమా ఏ ఇబ్బందులు లేకుండా కలెక్షన్లు రాబట్టాలి అంటే,డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడులు వెనక్కి రావాలంటే,ఓటీటీకి కనీసం ఈ మాత్రం పరిమితి తప్పదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని పెద్ద సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్స్ అనుకున్నంత స్థాయిలో రాబట్టలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవాల్సి వచ్చింది.క్రమక్రమంగా సినిమాల థియేట్రికల్ మార్కెట్ తగ్గిపోతున్న నేపథ్యంలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలను చెల్లించడానికి సిద్ధంగా లేరని కూడా తెలుస్తోంది.

ఆ రకంగా థియేట్రికల్ మార్కెట్ ను కాపాడుకోవడానికి నిర్మాతలు ఓటీటీ డీల్స్ పై కాస్త కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.అదే సమయంలో థియేటర్లలో ఆడని సినిమాల డిజిటల్ రిలీజుల గురించి కూడా ఇక్కడ ఆలోచించాలి. అయినా ఆ సినిమాలకు కూడా పరిమితి 6 వారాలే కాబట్టి నిర్మాతలు భయపడాల్సిన అవసరం లేదు.

ఏది ఏమైనప్పటికీఅన్ని వర్గాల వారు సంతృప్తి చెందేలా ఈ కొత్త నిబంధనలు అమలు అయ్యేలా తెలుగు సినిమా నిర్మాతల మండలి లేదా ఇతర పెద్దలు సరైన విధంగా అందరినీ ఒక దారిలో నడిపిస్తే మంచిది.

Follow on Google News Follow on Whatsapp

READ  హ్యాట్సాఫ్ డార్లింగ్ అనిపించుకున్న ప్రభాస్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories