Homeసినిమా వార్తలునేను మీకు బాగా కావాల్సిన వాడిని టీజర్: మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో వస్తున్న కిరణ్...

నేను మీకు బాగా కావాల్సిన వాడిని టీజర్: మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో వస్తున్న కిరణ్ అబ్బవరం

- Advertisement -

తొలి సినిమా నుండి యువతను ఆకట్టుకునే పాత్రలను, క‌థ‌ల‌ను ఎంచుకుంటూ చక్కని నటనను ప్రదర్శిస్తూ.. మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. మూడు నెలల వ్యవధి లోనే సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే చిత్రాలను విడుదల చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. తాజాగా తన రాబోయే చిత్రం‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.

‘నేను మీకు బాగా కావాల్సిన‌ వాడిని’ సినిమాకి శ్రీధ‌ర్ గాదె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌ బృందం ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే ఈ సినిమాకి సంభదించిన టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.

టీజర్ చూస్తుంటే మరోసారి ఒక సాధారణ కుర్రాడికి హీరోయిజం టచ్ ఇచ్చిన పాత్రలో కిరణ్ కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కిరణ్ డ్రైవర్ గా కనిపించబోతున్నారు. పంచ్ డైలాగులతో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ హీరోకి బాబాయిగా కనిపించటం మరో విశేషం. “నేను బాలయ్య బాబు .. వీడు పవన్ కళ్యాణ్” అంటూ బాబా భాస్కర్ చెప్పే డైలాగ్ ఆయా హీరో అభిమానులను అలరిస్తుంది. ఇక టీజర్ చివరలో “నేను ప్రేమిస్తే మదన్ ని.. మరి ప్రేమించకపోతే ” అనే డైలాగ్ భలే ఫన్నీగా ఉంది.

READ  హరిహర వీరమల్లు ఆగిపోయిందా?

స్టైలిష్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌ గా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోడి రామ‌కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో కోడి దివ్వ దీప్తి నిర్మిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories