Homeసినిమా వార్తలుNBK107: అఖండ సెంటిమెంట్ ను రిపీట్ చేయనున్న బాలయ్య

NBK107: అఖండ సెంటిమెంట్ ను రిపీట్ చేయనున్న బాలయ్య

- Advertisement -

తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 107(working title). గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో బాలయ్యని మునుపెన్నడూ చూడని మాస్ పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో, బాలకృష్ణ గెటప్ మరియు డైలాగులు నందమూరి అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బిజీ షెడ్యూల్ లో జరిగుతోంది.

రానున్న వారం రోజుల్లో బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆలంపూర్ లో జరుగతుండగా.. షూటింగ్ లొకేషన్ నుంచి బాలకృష్ణ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.

ఇటీవలే కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ, త్వరితగతిన కోలుకుని మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక లీక్ అయిన ఫోటోలలో బాలకృష్ణ కొత్త లుక్ చూసి అభిమానులు ఎంతగానో సంతోషించారు.

READ  హరిహర వీరమల్లు ఆగిపోయిందా?

ఇదిలా ఉండగా, ఇంతవరకూ ఈ చిత్రం యొక్క విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ముందుగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని భావించారట. అయితే షూటింగ్ పలు మార్లు వాయిదా అవడం మూలాన ఆ డేట్ కాకుండా బాలకృష్ణ లేటెస్ట్ హిట్ అఖండ రిలీజ్ అయిన సీజన్ లోనే అంటే డిసెంబర్ రెండో తేదీకి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. మరి ఈ విషయాన్ని చిత్ర బృందం ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా..తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపీచంద్ మలినేని చివరగా క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నారు. బాలయ్య అఖండ సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం వస్తుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

READ  విరాట పర్వంలో ఈ బూతులను సెన్సార్ కట్ చేసింది

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories