టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం (కేఎస్ రవీంద్ర) బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ NBK 109 రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమా పై బాలకృష్ణ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా ఆయన కెరీర్లో నిలిచిపోయేలా దీనిని అద్భుతంగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారని యూనిట్ చెబుతోంది. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క టైటిల్ టీజర్ ని రేపు దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేద్దాం అని యూనిట్ భావించింది.
అయితే తాజాగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ టీజర్ కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో దానిని మరి కొన్నాళ్ళు వాయిదా వేసి నవంబర్ మొదటి వారం లేదా రెండు వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఇక అక్కడి నుంచి NBK 109 మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఉంటాయట. పక్కాగా సినిమాని జనవరిలో సంక్రాంతి కానుక రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.