నేచురల్ స్టార్ నాని తెలిసో తెలియకో తరచూ ఓకే తప్పును పునరావృతం చేస్తున్నారు. నాని నటించిన తాజా చిత్రం దసరాకు విడుదలకు సిద్ధం కాగా ప్రస్తుతం ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలను ఎంచుకోవడం, కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన దిట్ట. తన సినిమాల పట్ల చాలా పాజిటివ్ గా ఉండే నాని సాధారణంగా ప్రచార కార్యక్రమాల్లో ఆ సినిమాల గురించి కాస్త ఎక్కువగా మాట్లాడతారు.
ఇటీవల వచ్చిన శ్యామ్ సింఘా రాయ్, అంటే సుందరానికీ వంటి సినిమాలు విడుదలకు ముందే అతివిశ్వాసంతో కనిపించి అవి సూపర్ హిట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు ఆయనని నిరాశ పరిచాయి అనే చెప్పాలి.
శ్యామ్ సింఘా రాయ్ కనీసం విజయవంతమైన చిత్రంగా నిలిచింది. కానీ అది కేవలం బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకుంది. ఇక నాని విడుదల చేసిన చివరి చిత్రం అంటే సుందరానికీ ఘోరంగా విఫలమైంది. సోషల్ మీడియాలో కూడా నాని విడుదలకు ముందు చాలా మాట్లాడారని, కానీ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు లేవని నెటిజన్లు నాని చేసిన కామెంట్స్ పై ట్రోల్ చేస్తున్నారు.
అంటే సుందరానికీ సినిమాకి వచ్చిన స్పందన,ముఖ్యంగా బాక్సాఫీస్ పర్ఫామెన్స్ చూసి నాని మరింత నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు తన తాజా చిత్రం దసరాకు కూడా ఆయన అదే తప్పు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఘనవిజయం సాధించిందని, ఆల్ ది బెస్ట్ అవసరం లేదని, ప్రేక్షకులు తనను అభినందించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈసారి దసరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద కూడా ఆయన నమ్మకం నిజం అవుతుందని ఆశిస్తున్నాం.
కాగా ఇటీవలే ఇక ప్రమోషనల్ ఈవెంట్ లో నాని.. ట్రైలర్ లోని అభ్యంతరకరమైన పదం గురించి అడిగినప్పుడు, ‘బంచత్’ అనే పదం గురించి మాట్లాడారు. అందరూ అనుకున్నట్టు ఆ పదం అనుకున్న దానికంటే భిన్నమైన ఉద్దేశ్యం మరియు అర్థాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప’ చిత్రాల లాగే దసరా కూడా సంచలనం ఈ సృష్టిస్తుందా అని అడగ్గా, సబ్జెక్ట్ పరంగా, ఇమాజినేషన్ పరంగా వాటితో పోల్చవచ్చు కానీ వాటికైన ఖర్చు, ఇతర అంశాలతో పోల్చలేమని నాని సూచించారు.