Homeసినిమా వార్తలుDasara Trailer: కథ గురించి స్థూలంగా సూచించిన నాని దసరా ట్రైలర్

Dasara Trailer: కథ గురించి స్థూలంగా సూచించిన నాని దసరా ట్రైలర్

- Advertisement -

నాని తాజా చిత్రం దసరా ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. కాగా ట్రైలర్ లోని విజువల్స్ చూస్తే వీర్లపల్లి అనే చిన్న పల్లెటూరులో బొగ్గు కుప్పల నేపథ్యంలో పెరిగిన ఓ వ్యక్తి ఎదుగుదలకు సంబంధించిన తీవ్రమైన, రక్తసిక్తమైన కథలా ఈ చిత్రం కనిపిస్తుంది.

నాని పాత్ర, సినిమా పై కూడా ఈ ట్రైలర్ ఓ అవగాహన కల్పించింది. అతను నిర్లక్ష్యపూరితంగా ఉంటాడు, మరియు అతను ప్రతి విషయంలోనూ గొడవలు పడటం అలవాటు చేసుకున్న వ్యక్తిగా చూపించారు. మిగిలిన ట్రైలర్ చూస్తే దసరా సినిమాలో హింస ఎక్కువగా ఉంటుందని నిరూపించే షాట్స్ తో నిండి ఉంది. ట్రైలర్ చివర్లో ఎవరినో గట్టిగా కొట్టడంతో నాని నిర్భయమైన పాత్రను పోషిస్తున్నారని కూడా బలంగా సూచిస్తోంది.

హీరో, హీరో స్నేహితుడు, హీరోయిన్, విలన్ అనే నాలుగు ప్రధాన పాత్రల మధ్య దసరా కథ ముడిపడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా హీరో స్నేహితుడి పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందని, ఆయన పాత్ర చుట్టూ ఉండే ఎమోషనల్ అంశం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.

READ  Dasara: థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న దసరా నిర్మాత

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయ నున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Dhanush: సార్ సినిమాతో ఎలైట్ క్లబ్‌లో చేరిన ధనుష్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories