గత గురువారం విడుదలైన నాని దసరాకు పాజిటివ్ రివ్యూలతో పాటు మంచి టాక్ రావడంతో ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్ డే, వీకెండ్ కలెక్షన్లు సాధించింది. నాని అద్భుతమైన నటన, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గ్రామీణ తెలంగాణను సహజంగా చిత్రీకరించడం, ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు కూడా సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్, ROI వంటి ఏరియాల్లో ఈ సినిమా సూపర్బ్ గా ఆడింది. కాగా ఇప్పటికే లాభాల్లో రన్ అవుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ చిత్రం పర్ఫామెన్స్ గురించి అదే విధంగా చెప్పలేము.
నైజాంతో పోలిస్తే ఆంధ్రాలో ముఖ్యంగా బి/సి సెంటర్స్ లో ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫామెన్స్ అంతగా బాగోలేదు. అలాగే వీకెండ్ తర్వాత సోమవారం ఈ సినిమా గణనీయమైన డ్రాప్స్ ను చవిచూసిందని, ఆంధ్రాలో నష్టాల బాటలో పయనిస్తోందని, ప్రీ రంజాన్ సీజన్ లో విడుదల కావడం, మరియు భారీ ధరలకు సినిమాని కొనడమే ఇందుకు కారణమని కొన్ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే దసరా థియేట్రికల్ బిజినెస్ రూ.44 కోట్లు కాగా, ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకుంది. కాగా ఈ సినిమా రన్ కూడా ఇంకా ముగియలేదు. తదుపరి వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మరి ఈ వీకెండ్ ను దసరా ఎలా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సాయికుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సత్యన్ సూర్యన్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.