నాని నటించిన దసరా సినిమాకి ఈ వీకెండ్ లో ఊహించని అడ్వాంటేజ్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తోంది. ఈ శుక్రవారం శాకుంతలం, రుద్రుడు సినిమాలు పోటీగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రుద్రుడు, శాకుంతలం రెండూ పేలవమైన ఓపెనింగ్స్ ను రాబట్టి, శనివారం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా క్రాష్ అయ్యాయి.
దీంతో దసరాకి 3వ వారాంతంలో కూడా కొత్త విడుదలల పై ఆధిపత్యం చలాయించే అవకాశం వచ్చింది. రుద్రుడు.. శాకుంతలం రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద భారీ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. శాకుంతలం ఒక పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా కాగా, రుద్రుడు కంప్లీట్ యాక్షన్ రివేంజ్ డ్రామా.
కాగా జానర్, భారీ స్టార్ కాస్ట్ కారణంగా శాకుంతలం మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావించినప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై భారీ పరాజయం పాలైంది. ఇక మాస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుందని భావించిన రుద్రుడు విషయంలోనూ అదే జరిగింది. ఇలా కొత్త రిలీజ్ లు ఫెయిల్ కావడం దసరాకు ఒక అడ్వాంటేజ్ గా మారడంతో ఈ రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రేక్షకులు కొత్త సినిమాల పై ఆసక్తి లేకపోయినా.. అవి వాళ్ళని ఆకట్టుకోలేక పోయినా ఇదివరకే మంచి సినిమాను మళ్ళీ చూస్తారు. దసరా విషయంలో అదే జరిగింది.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ధీక్షిత్ శెట్టి, సాయికుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సత్యన్ సూర్యన్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.