నాని నటించిన దసరా చిత్రం మార్చి 30న విడుదలై పాజిటివ్ రివ్యూలు, మంచి టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి భారీ హీరోల చిత్రాలను సైతం వెనక్కి నెట్టి తొలిరోజు రూ.6.5 కోట్లతో 2023లో అత్యధిక టాలీవుడ్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే నైజాంతో పోలిస్తే ఈ సినిమా ఆంధ్రా ఏరియాల్లో తక్కువ వసూళ్లు సాధించి కాస్త స్లో అవ్వడం మొదలైంది.
నాని అద్భుతమైన నటనకు తోడు కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టిల సహజ నటనతో పాటు.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 90వ దశకం నాటి గ్రామీణ తెలంగాణను సహజంగా చిత్రీకరించడం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. దసరా 13 రోజుల బాక్సాఫీస్ రన్ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలు – 43 కోట్లు
ఓవర్సీస్ – 10 కోట్లు
ROI – 4 కోట్లు [తెలుగు వెర్షన్]
మొత్తం షేర్ – 57 కోట్లు
నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తన ఆన్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ తో సమానంగా బాక్సాఫీస్ వద్ద సినిమాలు కూడా సత్తా చాటుతాయని మరోసారి రుజువు చేసింది.
ధరణి (నాని), వెన్నెల (కీర్తి), సూరి (దీక్షిత్) అనే ముగ్గురు చిన్ననాటి స్నేహితుల కథే దసరా. 90వ దశకంలో తెలంగాణలోని వీరపల్లి గ్రామంలో జరిగే ఈ సినిమా ప్రధాన కథాంశం పల్లె రాజకీయాలు, బొగ్గు, సిల్క్ బార్ కారణంగా ఈ జీవితాలు ఎలా చిక్కుకుపోయాయి.. ఎలా శాశ్వతంగా మారిపోయాయి అనే అంశాలను వివరిస్తుంది.