తొలిసారిగా అందాల రాక్షసి మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి ఫస్ట్ మూవీతో మంచి విజయం అందుకున్నారు .ఇక అక్కడి నుండి ఎంతో సెలెక్టీవ్ గా స్టోరీస్ తో మూవీస్ చేస్తూ వెళ్తున్న హను ఇటీవల దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో తీసిన సీతారామం మూవీ ద్వారా భారీ విజయం సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఒక మూవీ చేస్తున్నారు హను.
రెండు రోజుల క్రితం అఫీషియల్ గా లాంచ్ అయిన ఈమూవీ 1940 ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రెండవ ప్రపంచయుద్ధ నేపథ్యంలో సాగనున్న కథ. ఈ మూవీ ద్వారా పాకిస్తానీ నటి ఇమాన్ ఎస్మాయిల్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. విషయం ఏమిటంటే, వాస్తవానికి హను మొదట ఈ కథని నానికి వినిపించారని తెలుస్తోంది. సీతారామం మూవీ టైంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా హను మాట్లాడుతూ, నాని తో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగె కథతో మూవీ చేయనున్నట్లు చెప్పారు.
అయితే ఆ కథకి భారీ స్పాన్ ఉండడంతో ఆ తరువాత దానిని ప్రభాస్ తో తీయడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇక తాజాగా నాని నటించిన సరిపోదా శనివారం ట్రైలర్ చూసి అద్భుతంగా ఉందని హను ట్వీట్ చేయగా దానికి స్పందించిన నాని, ఎపిక్ కోసం ఎదురుచూస్తున్నాను త్వరగా ఆడియన్స్ ముందుకి తీసుకురండి అంటూ కామెంట్ పెట్టారు. సో, దీనిని బట్టి ఆయనకు చెప్పిన కథ ఇదే అని తెలుస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈమూవీ 2026 లో రిలీజ్ కానున్నట్లు టాక్.