మార్చి 30న విడుదలైన నాని దసరాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. విడుదలకు ముందు నిర్మాతలు, హీరో నాని ఈ సినిమా కోసం చాలా ప్రమోషన్స్ చేయడంతో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హైప్ వచ్చింది. థియేటర్లలో విజయవంతంగా రన్ అయిన దసరా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా నాలుగు భాషల్లో దసరా ప్రస్తుతం ప్రసారం కాబడుతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.
నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం వీర్లపల్లిలో నివసించే ముగ్గురు చిన్ననాటి స్నేహితులు ధరణి, సూరి, వెన్నెలల జీవితాన్ని వివరిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న సిల్క్ బార్ మరియు గ్రామ రాజకీయాల వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులకు గురయ్యాయి అనేది ప్రధాన కథ.
కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టిల సహజ నటనతో దసరాలో నాని ప్రదర్శించిన అద్భుతమైన నటనకు మంచి మద్దతు లభించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గ్రామీణ తెలంగాణను సహజంగా చిత్రీకరించడంతో పాటు ఇందులోని ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.