నాని తెలుగు చిత్ర పరిశ్రమకు అత్యంత నాణ్యత గల చిత్రాలను అందించిన సమర్థుడైన నటుడు. నాని తన తదుపరి యాక్షన్-ప్యాక్డ్ చిత్రం దసరా కోసం సిద్ధమవుతున్నారు. కాగా ఈ చిత్రం 2023 మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా బహుళ భాషల్లో విడుదల కానుంది. హిందీలో ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ఖైదీకి రీమేక్ అయిన అజయ్ దేవగణ్ యొక్క భోలాతో పాటుగా విడుదల అవుతుంది మరి ఈ చిత్రం హిందీ మార్కెట్‌లో ఎలా ప్రభావం చూపుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇక దసరా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా, త్రివిక్రమ్ తన కోసం కథ రాస్తున్నారని, మేమిద్దరం త్వరలో కలిసి పనిచేస్తామని నాని పేర్కొన్నారు. ఇక త్రివిక్రమ్ కేవలం స్టార్ హీరోలతో మాత్రమే పని చేయడానికి ఆసక్తి చూపే వ్యక్తి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో కూడా నితిన్‌తో అ ఆ అనే సినిమా చేయగా ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ విషయమై నాని మాట్లాడుతూ.. త్రివిక్రమ్ రచనలో తను నటిస్తే అది గొప్ప కలయిక అని భావిస్తున్నట్లుగా తెలిపారు. మరియు త్రివిక్రమ్ గతంలో మల్టీ స్టారర్ గురించి కూడా చర్చించాలనుకున్నారనీ. కానీ అది జరగలేదని నాని చెప్పారు. కానీ ఏదో ఒక రోజు, త్రివిక్రమ్ తో సినిమా చేస్తే అది మరపురాని చిత్రంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని నాని తెలియజేశారు.
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB28 కోసం పని చేస్తున్నారు. నాని తన కామెడీ టైమింగ్‌కి బాగా పేరు తెచ్చుకున్నాతుట్ మరియు త్రివిక్రమ్ డైలాగ్స్ నాని చెప్పడం అనే ఊహే ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక వేడుకలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే వార్తలు నిజమవుతాయని మేము ఆశిస్తున్నాము.