నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడవతరం వారసుడు నందమూరి మోక్షజ్ఞ. బాలకృష్ణ కుమారుడిగా మోక్షజ్ఞ ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక గ్రాండ్ మైథాలజికల్ యాక్షన్ మూవీకి పచ్చ జెండా ఊపి తద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందరిలో మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
త్వరలో గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు తాజాగా మోక్షజ్ఞ సెకండ్ సినిమా కూడా ఫిక్స్ అయింది. ఇటీవల లక్కీ భాస్కర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యువ దర్శకుడు వెంకకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ లెవెల్ లో మోక్షజ్ఞ సెకండ్ మూవీ నిర్మించనున్నారు.
అతి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి అధికారికి వివరాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా మొదటి మూవీ ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే మోక్షజ్ఞ యొక్క సెకండ్ మూవీ కూడా ఫిక్స్ పిక్స్ కావటం విశేషం. మరి ఈ సినిమాలతో నటుడిగా మోక్షజ్ఞ ఆడియన్స్ ని ఏ స్థాయిలో అలరించి క్రేజ్ అందుకుంటారో చూడాలి.