Homeసినిమా వార్తలునందమూరి అభిమానుల్లో చీలిక.. బాలయ్య VS ఎన్టీఆర్ ఫ్యాన్స్

నందమూరి అభిమానుల్లో చీలిక.. బాలయ్య VS ఎన్టీఆర్ ఫ్యాన్స్

- Advertisement -

RRR సినిమా విడుదలైన దగ్గర నుండి, హీరో ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులు కాస్త కఠినమైన, క్లిష్టతరమైన కాలాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పాలి. RRR సినిమాలో రామ్ చరణ్‌ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజమౌళి ఎన్టీఆర్ ఇమేజ్ తో పాటు కెరీర్‌కు చాలా నష్టం కలిగించాడని ఎన్టీఆర్ అభిమానులు చాలా బలంగా భావించారు. ఈ విషయంలో నిజానిజాలు పక్కన పెడితే ఎన్టీఆర్ అభిమానులకు కాస్త ఆనందాన్ని ఇచ్చే విషయాలు జరిగి చాలా కాలం అయింది.

RRR తర్వాత కొరటాల శివతో చేయబోయే ఎన్టీఆర్30 సినిమాకు సంభందించిన ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా రాలేదు. కేవలం సినిమాను అధికారికంగా ప్రకటించటం తప్ప సినిమా సెట్స్ పైకి వెళ్ళడం గూర్చి కానీ, ఎప్పుడు మొదలవుతుంది అని కానీ ఎలాంటి సమాచారం రాలేదు.

ఇతర స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, పవన్ మరియు ప్రభాస్ లు మాత్రం ఎవరి సినిమా షూట్‌లతో వారు బిజీగా ఉండగా, ఎన్టీఆర్ తదుపరి సినిమా మాత్రం RRR విడుదలై 6 నెలలు కావస్తున్నా ఇంకా ప్రారంభం కాలేదు.

READ  రణ్బీర్ కపూర్ షంషేరా OTT స్ట్రీమింగ్ డీటైల్స్

ఇక సినీ కెరీర్ లో ఇబ్బందులు, అడ్డంకులు చాలవు అన్నట్టు ఎన్టీఆర్ ను తాజాగా మరో సమస్య చుట్టుముట్టింది. తాజాగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం పై ఆయన స్పందించారు. అయితే ఆయన స్పందించిన విధానం ఇటు టీడీపీ మద్దతుదారులతో పాటు అటు నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.

ఇది దౌత్యపరమైన ప్రకటన అని, ఎన్టీఆర్ లాంటి మహానాయకుడుతో వైఎస్ఆర్‌ను సమంగా పోల్చే తప్పు చేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఘాటుగా విమర్శించలేదని నందమూరి బాలకృష్ణ అభిమానులు, టిడిపి వర్గాల వారు భావించారు.

ఇలా చప్పగా స్పందించే కంటే అసలు ప్రకటన విడుదల చేయకుండా ఉండుంటే సరిపోయేదని చాలా మంది అంతర్గత వ్యక్తులు భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రకటనతో ఆగ్రహానికి గురై ఆయన నటించే సినిమాలను బహిష్కరించాలని టీడీపీ, ఇతర బాలకృష్ణ అభిమానులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక పై ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోము అని కొందరు అభిమానులు తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇన్ని స‌మ‌స్య‌ల‌లో చిక్కుకున్న ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులకి కాస్త ఉపశమనం కలిగించేలా ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ మొద‌ల‌యితే బాగుంటుంది. అదే గనక జరిగితే వివాదాలకు దూరంగా ఎవరి పని వారు చేసుకునే వీలుంటుంది.

READ  "నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని" చిత్రం నుండి "నచ్చావ్ అబ్బాయి" పాట విడుదల

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories