Homeసినిమా వార్తలుNBK107: క్రిస్మస్ కానుకగా విడుదల అవుతున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని

NBK107: క్రిస్మస్ కానుకగా విడుదల అవుతున్న బాలకృష్ణ – గోపీచంద్ మలినేని

- Advertisement -

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఆఖండ విజయంతో మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ మరో మాస్ సినిమా చేస్తున్నారు.మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కమిటైన బాలయ్య బాబు NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఓ పవర్ ఫుల్ మాస్ మసాలాగా తెరకెక్కుతున్న ఈ సినిమానిమైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.మొన్నటి వరకూ ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా,షూటింగ్ లో జాప్యం వలన.. ఇటీవలే బాలకృష్ణకు కరోనా సోకడం..విశ్రాంతి తీసుకుని మళ్ళీ రావడం వంటి కారణాల వల్ల రిలీజ్ డేట్ ను డిసెంబర్ 23 తేదీకి మార్చినట్టు తెలిసింది.క్రిస్మస్ సెలవుల సీజన్ లో కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం మెండుగా ఉన్నందున అది మంచి నిర్ణయం అనే చెప్పాలి.

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఫారిన్ ఫైట్ హైలైట్ కాబోతోందని సమాచారం.ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవాలని భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్ సీన్స్ హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఫస్టాఫ్‌లో వచ్చే ఫారిన్ ఫైట్ సినిమాకే హైలైట్ అవుతుందని, అంతేకాదు ఈ ఫైట్ సీన్ నందమూరి అభిమానులకు ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

READ  777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

అదే విధంగా సెకండాఫ్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాలకృష్ణ గత సినిమాల్లో చూడని విధంగా ఉండబోతోందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి జై బాలయ్య అనే పేరు ఖరారు చేశారని, త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందని అంటున్నారు.అదే గనక నిజం.అయితే నందమూరి అభిమానులు పండగ చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదిరిపోయే లెవెల్ లో కనిపించనున్నారటఅలాగే ఓ మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన యూనిట్ ఆ పాట కోసం డస్కి బ్యూటీ డింపుల్ హయతిని ఎంపిక చేసుకున్నారని సమాచారం.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆంధ్రప్రదేశ్: థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకున్న ఎగ్జిబిటర్లు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories