Homeసినిమా వార్తలుపవన్ కళ్యాణ్ రికార్డులను దాటలేకపోయిన నందమూరి బాలకృష్ణ

పవన్ కళ్యాణ్ రికార్డులను దాటలేకపోయిన నందమూరి బాలకృష్ణ

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల పాత బ్లాక్ బస్టర్ సినిమాల స్పెషల్ షోలు నిర్వహించే ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అభిమానులు ఉన్న జోరు.. వారు చూపుతున్న ఉత్సాహం చూస్తుంటే ఈ ప్రవాహం ఇప్పట్లో ఆగేలా లేదు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలను ఇలానే ప్రత్యేక ప్రదర్శనలు జరిపించే అవకాశం ఎంతైనా ఉంది.

మొదట మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ పోకిరి స్పెషల్ షోలతో ఈ ట్రెండ్ మొదలైంది మహేష్ అభిమానులు ఆ స్పెషల్ షోలను భారీ స్థాయిలో జరుపుకున్నారు. ఆ తర్వాత మెగా అభిమానులు చిరంజీవి ఘరానా మొగుడు ప్రత్యేక షోలను ప్రదర్శించారు.

ఆ తర్వాత జల్సా స్పెషల్ షోలతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు పోకిరి నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేశారు. ఇప్పుడు బాలకృష్ణ చెన్న కేశవ రెడ్డి సినిమా భారీ హైప్ మధ్య మళ్లీ విడుదలైంది. అయితే పవన్ కళ్యాణ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడంలో మాత్రం విఫలమైంది. స్పెషల్ షోలకు చాలా మంచి స్పందన వచ్చినప్పటికీ, వాటి ప్రభావం పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు స్టార్‌డమ్‌కు సరిపోలేదు.

READ  పవన్ కళ్యాణ్ తో మా సినిమా తప్పకుండా ఉంటుంది - నిర్మాత రామ్ తాళ్లూరి

ఇక చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోలు ఓవర్సీస్‌లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి USAలో అల్ టైం రికార్డులు సృష్టించినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ స్థాయిలో హవా చూపించలేక పోయింది.

ఆ రకంగా ఓవర్సీస్ లో అద్భుతమైన సంఖ్యలు నమోదు చేసిన చెన్నకేశవరెడ్డి మన దగ్గర మటుకు చాలా సాధారణంగా ఉన్నాయి. ఈ చిత్రం జల్సా మరియు పోకిరి చూపిన ప్రభావానికి చాలా దూరంలో ఆగిపోయింది అని చెప్పాలి. మరియు ఆంధ్రా మరియు తెలంగాణ రాష్ట్రాలలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల క్రేజ్ కు నిజంగా సాటిలేనిదని ఈ రకంగా మరోసారి రుజువయింది.

మొత్తంగా స్పెషల్ షోలలో జల్సా సినిమా ఇప్పటికీ అత్యధిక షోలు మరియు రీ-రిలీజ్‌కు సంబంధించిన రికార్డులను తన పేరిటే ఉంచుకుంది. మరి ఈ రికార్డు బ్రేక్ చేసేది ఏ స్టార్ సినిమానో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

ఇక అక్టోబర్ నెలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా.. వర్షం, బిల్లా, చత్రపతి సినిమాలను ప్రత్యేక ప్రదర్శనలు జరిపించనున్నారు. మరి ఆ స్పెషల్ షోలు ఏ రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి.

READ  బాలీవుడ్ హీరో రణ్ బీర్ నోట.. తెలుగు మాట

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories