Homeసినిమా వార్తలుఉత్కంఠభరితంగా ఉన్న నాగార్జున ఘోస్ట్ (Ghost) టీజర్

ఉత్కంఠభరితంగా ఉన్న నాగార్జున ఘోస్ట్ (Ghost) టీజర్

- Advertisement -

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నారు. సరికొత్త కథలతో.. వినూత్నమైన ఆలోచనలతో సినిమాలు తీసే ఆయన ఈ చిత్రానికి దర్శకుడు కావడంతోఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో నాగార్జున పోషిస్తున్న పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందట. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆసక్తి రేకెత్తెలా ఉండగా, ఈరోజు జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ఈ చిత్రం తాలూకు టీజర్ ను విడుదల చేశారు.

టీజర్ లో కత్తి పట్టుకుని నాగార్జున చేసిన ఫైట్ అబ్బురపరిచేలా ఉండగా.. కెమెరా మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్కంఠభరితంగా ఉండి టీజర్ కు తమ సహాకారం అందించాయి. ఇక టీజర్ చివరలో చిత్రాన్ని అక్టోబర్ 5న అంటే దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ధృవీకరించారు.

READ  నాగ చైతన్య మీద ఆగని పుకార్లు

ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటించాల్సింది. కానీ ఆమె గర్భవతి కావడంతో ఈమె స్థానంలో సోనాల్‌ చౌహాన్‌ను తీసుకున్నారు. ఇక ఇప్పటికే దుబాయ్‌లో సోనాల్ చౌహాన్‌, నాగార్జునలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

గరుడ వేగ హిట్ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు… బంగార్రాజు వంటి హిట్ సినిమాల తర్వాత ఇద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం పై అటు ఇండస్ట్రీలో ఇటు అక్కినేని అభిమానుల్లోభారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున రా ఏజెంట్ గా నటిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  సాయి పల్లవి కి కోర్టులో చుక్కెదురు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories